యుద్ధభూమిలో నెలల తరబడి నరకయాతన.. చివరకు డ్రోన్‌తో సైనికుడికి రక్షణ

రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఓ సైనికుడి జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది. తీవ్రంగా గాయపడి, కదల్లేని స్థితిలో యుద్ధభూమిలో చిక్కుకున్న ఉక్రెయిన్ సైనికుడు వ్లాసెంకో ప్రాణాలు కాపాడుకోవడానికి తన పాదాన్ని తానే నరుక్కోవాల్సి వచ్చింది. నెలల తరబడి నరకయాతన అనుభవించిన అతడిని చివరకు ఉక్రెయిన్ సైన్యం భారీ డ్రోన్ సాయంతో గాల్లోకి ఎత్తి సురక్షిత ప్రాంతానికి తరలించింది. సంప్రదాయ వాహనాలు చేరుకోలేని ప్రమాదకర ప్రాంతం నుంచి గాయపడిన సైనికుడిని డ్రోన్ ద్వారా బయటకు తీసుకురావడం యుద్ధంలో సాంకేతిక పరిజ్ఞానం ప్రాధాన్యాన్ని చాటిచెప్పింది. గత ఏడాది మే...