ధనుష్ పొలిటికల్ ఎంట్రీ ఖాయమేనా..?

తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ ప్రవేశంతో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్న వేళ, మరో సినీ నటుడు ధనుష్ పేరు చుట్టూ కొత్త చర్చ మొదలైంది. ధనుష్ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారానికి ఇప్పటివరకు ఆయన నుంచి అధికారిక ప్రకటన రాలేదు. అయినప్పటికీ, అభిమాన సంఘాల కార్యకలాపాలు, వరుస సమావేశాలు, సేవా కార్యక్రమాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. చెన్నైలోని తొరైపాక్కంలో 3,000 మందికి పైగా మహిళా అభిమానులతో నిర్వహించిన సమావేశం ఈ చర్చకు మరింత ఊతమిచ్చింది. గతంలో నర్పణి మండ్రంగా ఉన్న అభిమాన సంఘం పేరును...