రవితేజ సినిమా ఛాన్స్ మిస్సింగ్.. రాత్రంతా ఏడుస్తూనే కూర్చున్నా..

టాలీవుడ్‌లో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్న దివి వైద్య తన సినీ ప్రయాణంలో ఎదురైన చేదు అనుభవాలను తాజాగా వెల్లడించారు. ‘మహర్షి’ సినిమాతో నటిగా పరిచయమైన ఆమె, బిగ్‌బాస్‌ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఆ కార్యక్రమంలో తన అమాయకత్వం, ఆటతీరుతో అభిమానులను ఆకట్టుకున్న దివి, బయటకు వచ్చిన తర్వాత కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో నిరంతరం అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. గ్లామర్‌తో పాటు నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో కనిపిస్తూ కెరీర్‌లో ముందుకు సాగుతున్నారు. అయితే తన సినీ ప్రయాణం...