STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 27 October 2026, 12:24 am Posted by : START TRINETHRAM

ఐపీఎల్ ఫ్రాంచైజీలకు డెడ్‌లైన్.. నవంబర్ 15 కీలక గడువు

ఐపీఎల్‌ 2027 సీజన్‌ మినీ వేలానికి సంబంధించి ఫ్రాంచైజీలకు కీలక గడువు విధించినట్లు సమాచారం. తాము కొనసాగించనున్న ఆటగాళ్లు, విడుదల చేయనున్న క్రికెటర్ల వివరాలను నవంబర్ 15లోగా సమర్పించాలని ఐపీఎల్‌ పాలక మండలి జట్లకు సూచించినట్లు తెలుస్తోంది. మినీ వేలం డిసెంబర్ 16న గోవా వేదికగా నిర్వహించనున్నట్లు సమాచారం. రిటెన్షన్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రతి జట్టులో అందుబాటులో ఉన్న ఆటగాళ్లు, ఖాళీ స్థానాల సంఖ్యపై స్పష్టత రానుంది. ఆ తర్వాత విడుదలైన క్రికెటర్లు వేలం కోసం నమోదు చేసుకుంటారు. అందుబాటులో ఉన్న ఆటగాళ్ల ప్రాథమిక జాబితాను పాలక మండలి ఫ్రాంచైజీలకు పంపుతుంది. జట్లు షార్ట్‌లిస్ట్‌ చేసిన అనంతరం వేలంలో పాల్గొనే ఆటగాళ్ల తుది వివరాలు వెల్లడవుతాయి.

మూడు వరుస సీజన్లలో విదేశాల్లో జరిగిన ఐపీఎల్‌ వేలం, ఈసారి భారత్‌లో నిర్వహించనుండటం విశేషం. అయితే 2027 సీజన్‌ ప్రారంభ తేదీలపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. గతంలో మార్చి 14 నుంచి మే 30 వరకు నిర్వహించేందుకు ప్రతిపాదించినప్పటికీ, బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా వ్యాఖ్యల ప్రకారం టోర్నీ మార్చి నెలాఖరులో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. డిసెంబర్‌లో జరిగే మినీ వేలం ప్రస్తుత చక్రంలో చివరిది కాగా, 2028 సీజన్‌కు ముందు మెగా వేలం జరగనుంది.