పుట్టుకతోనే పెద్ద మనిషిలా మీసాలు.. వైరల్ ఫొటో వెనుక అసలు నిజమిదే!

పుట్టుకతోనే పెద్ద మనిషిలా స్పష్టమైన నల్లటి మీసాలతో కనిపిస్తున్న ఓ నవజాత శిశువు ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆసుపత్రి మంచంపై టవల్‌లో చుట్టి ఉన్న పసికందు పైపెదవిపై దట్టమైన మీసాలు కనిపించడంతో పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. “మీసాలతో పుట్టిన బాలుడు.. వింత శిశువు జననం” అంటూ ఈ చిత్రాన్ని విస్తృతంగా పంచుకుంటున్నారు. దీంతో ఈ ఫొటో నిజమైనదేనా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి ఈ చిత్రం కృత్రిమ మేధ సాయంతో రూపొందించిన లేదా...