దీపావళికి ముందు ఇంటిని శుభ్రం చేస్తున్నారా? ఈ వస్తువులపై ఓ లుక్కేయండి!

దీపావళి పండుగ సమీపిస్తుండటంతో ఇళ్లలో శుభ్రత పనులు, పండుగ ఏర్పాట్లు జోరందుకుంటున్నాయి. హిందూ సంప్రదాయంలో దీపావళికి ప్రత్యేక ప్రాధాన్యం ఉండటంతో చాలామంది పండుగకు ముందే ఇళ్లను శుభ్రం చేసి, పాత వస్తువులను తొలగిస్తుంటారు. అయితే, కొన్ని వస్తువులను మాత్రం అవసరం లేకపోయినా ఇంట్లోనే ఉంచేస్తుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇలాంటి వస్తువులను ఇంట్లో ఉంచడం మంచిది కాదనే నమ్మకాలు ఉన్నాయి. అయితే వీటివల్ల దురదృష్టం లేదా ఆర్థిక సమస్యలు వస్తాయనే విషయాలకు శాస్త్రీయ ఆధారాలు లేవని గుర్తుంచుకోవాలి. వాస్తు నమ్మకాల ప్రకారం, విరిగిపోయిన దేవతా...