మహారాష్ట్ర ఓటర్ల జాబితా సవరణ.. గడువు పొడిగింపునకు సుప్రీంకోర్టు నిరాకరణ

మహారాష్ట్రలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో క్లెయిమ్‌లు, అభ్యంతరాల దాఖలుకు గడువును తక్షణమే పొడిగించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ ప్రక్రియలో దాదాపు 33 శాతం మంది ఓటర్ల పేర్లను అక్రమంగా తొలగించారని ఆరోపిస్తూ అరుణ్ ఆనందగిరి దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది అరవింద్ దాతార్ వాదనలు వినిపించారు. ముంబై, పూణే నగరాల్లో సుమారు...