ఆ గ్రామంలో అడుగడుగునా హనుమాన్ ఆలయాలే.. 50కి పైగా గుడులతో ప్రత్యేక గుర్తింపు!
సాధారణంగా ఏ గ్రామంలోనైనా ఒకటి లేదా రెండు ఆంజనేయ స్వామి ఆలయాలు కనిపిస్తాయి. కానీ జగిత్యాల జిల్లాలోని ఓ గ్రామంలో మాత్రం అడుగుపెట్టిన ప్రతి వీధిలోనూ హనుమంతుడి ఆలయాలు దర్శనమిస్తాయి. గల్లీకో గుడి అన్నట్లుగా 50కి పైగా ఆంజనేయ స్వామి ఆలయాలు కొలువై ఉండటంతో ఈ గ్రామం ప్రత్యేక గుర్తింపు పొందింది. భక్తి, ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్న ఈ ఊరు భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. జగిత్యాల జిల్లా, మెట్పల్లి మండలం పరిధిలోని వెల్లూల గ్రామంలో సుమారు 4,000 మంది జనాభా నివసిస్తున్నారు. గ్రామంలో...