ఎన్నికల్లో వింత హామీ.. ఓటేస్తే పెళ్లిళ్లు చేయిస్తామంటున్న నేతలు.. అసలు సమస్య ఇదే!

ఎన్నికలు వచ్చాయంటే రాజకీయ నాయకులు ప్రజలను ఆకట్టుకునేందుకు రకరకాల హామీలు ఇస్తుంటారు. రహదారుల నిర్మాణం, తాగునీటి సౌకర్యం, విద్యుత్ సమస్యల పరిష్కారం వంటి అంశాలు సాధారణంగా ప్రచారంలో వినిపిస్తాయి. అయితే రాజస్థాన్‌లోని పంచాయతీ ఎన్నికల ప్రచారంలో మాత్రం పెళ్లికాని యువకులకు వివాహాలు కుదిర్చేందుకు సహకరిస్తామనే హామీ చర్చనీయాంశంగా మారింది. వినడానికి ఆశ్చర్యంగా అనిపిస్తున్న ఈ అంశం వెనుక వివాహాలకు తగిన వధువులు దొరకడం లేదనే సామాజిక సమస్య ఉందని స్థానిక పరిణామాలు సూచిస్తున్నాయి. ‘ఒకే రాష్ట్రం.. ఒకే ఎన్నిక’ విధానంలో భాగంగా గ్రామ పంచాయతీలు,...