జ్వరంతో బాధపడినా వెనక్కి తగ్గని హర్మన్‌ప్రీత్.. బరిలో శతకం

జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకుంది. మ్యాచ్‌కు ముందు రోజు రాత్రి జ్వరంతో బాధపడినప్పటికీ, మందులు తీసుకుని మైదానంలోకి దిగినట్లు ఆమె వెల్లడించింది. తొలుత ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో ఇబ్బంది ఎదురైందని, విశ్రాంతి తీసుకోవాలనుకున్నా నొప్పి నివారణ మందులు కొంత ఉపశమనం కలిగించాయని తెలిపింది. అనారోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా దాదాపు 43 ఓవర్లపాటు బ్యాటింగ్ చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్ 121 బంతుల్లో 126 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర...