ఐపీఎల్ ఫ్రాంచైజీలకు డెడ్లైన్.. నవంబర్ 15 కీలక గడువు
ఐపీఎల్ 2027 సీజన్ మినీ వేలానికి సంబంధించి ఫ్రాంచైజీలకు కీలక గడువు విధించినట్లు సమాచారం. తాము కొనసాగించనున్న ఆటగాళ్లు, విడుదల చేయనున్న క్రికెటర్ల వివరాలను నవంబర్ 15లోగా సమర్పించాలని ఐపీఎల్ పాలక మండలి జట్లకు సూచించినట్లు తెలుస్తోంది. మినీ వేలం డిసెంబర్ 16న గోవా వేదికగా నిర్వహించనున్నట్లు సమాచారం. రిటెన్షన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రతి జట్టులో అందుబాటులో ఉన్న ఆటగాళ్లు, ఖాళీ స్థానాల సంఖ్యపై స్పష్టత రానుంది. ఆ తర్వాత విడుదలైన క్రికెటర్లు వేలం కోసం నమోదు చేసుకుంటారు. అందుబాటులో ఉన్న ఆటగాళ్ల...