90’s కుర్రాళ్ల ఫేవరేట్ సాంగ్ భయ్యా.. అప్పట్లో లవర్ కోసం తెగ పాడేవారు..

టాలీవుడ్‌ చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో పాటలు కాలంతో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరిస్తుంటాయి. అలాంటి పాటల్లో ‘ప్రేమికుడు’ చిత్రంలోని “అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే..” ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభుదేవా, నగ్మా జంటగా నటించగా, ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం పాటకు ప్రాణం పోసింది. దశాబ్దాలు గడిచినా ఈ పాటలోని వేగవంతమైన సంగీతం, ఆకట్టుకునే బాణీలు, ప్రభుదేవా అద్భుతమైన నృత్య కదలికలు ప్రేక్షకులను ఇప్పటికీ ఉర్రూతలూగిస్తున్నాయి. అప్పట్లో ఆయన ప్రదర్శించిన వినూత్న నృత్యశైలి యువతపై ప్రత్యేక ప్రభావం...