మోసాన్ని భరించ లేకపోయింది.. చివరికీ..!
కరీంనగర్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారంలో మోసపోయానని భావించి తీవ్ర మనస్తాపానికి గురైన అఖిల అనే యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. సైదాపూర్ మండలం ఎలబోతారం గ్రామానికి చెందిన అఖిల మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అదే గ్రామానికి చెందిన అక్షయ్ అనే యువకుడితో అఖిలకు పరిచయం ఏర్పడగా, అది ప్రేమ వ్యవహారానికి దారితీసినట్లు సమాచారం. అయితే, ప్రేమ...