తుపాను ముప్పుతో పలు రైళ్ల రద్దు.. ప్రయాణికులకు కీలక సూచన
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, విశాఖపట్నం రైల్వే డివిజన్ల పరిధిలో పలు మార్గాల్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది. అక్టోబర్ 27, 28 తేదీల్లో 2 రోజుల పాటు పలు రైలు సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రాజమహేంద్రవరం, విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ, కాకినాడ పోర్ట్, విశాఖపట్నం, పార్వతీపురం తదితర ప్రాంతాల మధ్య నడిచే రైళ్లపై ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది. దీంతో ఆయా మార్గాల్లో ప్రయాణించేందుకు ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైళ్ల...