దేశీయ వాహన రంగానికి కేంద్ర ప్రభుత్వం బిగ్ బూస్ట్

భారత రవాణా రంగంలో ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 100 శాతం ఇథనాల్‌తో నడిచే ఈ100 ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ వాహనాల తయారీ, వినియోగానికి అనుమతించేలా కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు–1989లో సవరణలు చేసింది. వాహనాల తయారీ ప్రమాణాలు, ఉద్గార నిబంధనల్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మార్పుల్లో భాగంగా సంబంధిత తేలికపాటి పెట్రోల్‌, డీజిల్‌ వాహనాల బరువు పరిమితిని 3,000 కేజీల నుంచి 3,500 కేజీలకు పెంచింది....