STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 25 October 2026, 10:40 pm Posted by : STAR TRINETHRAM

PVR: మహా పాదయాత్రలో భాగస్వాములు కండి

  • : పోతంశెట్టి వెంకటేశ్వరరావు విజ్ఞప్తి

స్టార్ త్రినేత్రం, మేడ్చల్: జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ తరలింపు కోసం ఎంపీ ఈటల రాజేందర్ చేపడుతున్న మహా పాదయాత్రలో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని భారతీయ జనతా పార్టీ నాగారం డివిజన్ ప్రధాన కార్యదర్శి పోతంశెట్టి వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఓ ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. డంపింగ్ యార్డ్ కారణంగా ప్రాంతంలోని నీరు, గాలి కలుషితమవుతున్నాయని, అనేక మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

డంపింగ్ యార్డ్ ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ప్రజల ఆరోగ్యంతో పాటు కుటుంబాల మనుగడకు కూడా ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం జరుగుతున్న పోరాటానికి నాగారం డివిజన్ పరిధిలోని ప్రజలంతా మద్దతుగా నిలిచి పాదయాత్రలో పాల్గొనాలని కోరారు. ఈ మహా పాదయాత్ర 27/10/2026 మంగళవారం ఉదయం 8:00 గంటలకు ఎదులాబాద్ నుంచి ప్రారంభమై 29/10/2026న జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వరకు కొనసాగనుందని తెలిపారు.

ALSO READ: Narayanpet: రైతుల సమస్యలపై తెలంగాణ రక్షణ సేన మహా ధర్నా