స్టార్ త్రినేత్రం, హన్మకొండ: హన్మకొండ జిల్లా వేలేరు మండలంలో బుధవారం గణేశ్ నిమజ్జనం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కిడ్స్ లక్ష్మీ గణపతి మండలి ఆధ్వర్యంలో 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్న గణనాథుడికి నిమజ్జనానికి ముందు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గణనాథుడిని శోభాయాత్రగా తరలించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
హన్మకొండ జిల్లా వేలేరు మండలంలో గణేశ్ నిమజ్జనం
కిడ్స్ లక్ష్మీ గణపతి మండలి ఆధ్వర్యంలో గణేశ్ నిమజ్జనం pic.twitter.com/tmDNbkz26T
— Star Trinethram Telugu (@Dheekondas10019) September 24, 2026
గణేశ్ నిమజ్జన శోభాయాత్రలో యువతులు, యువకులు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. భక్తి పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ శోభాయాత్రలో సందడి చేశారు. గణపతి నామస్మరణలతో పరిసర ప్రాంతాలు మార్మోగాయి. 9 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలు అందుకున్న గణనాథుడికి వీడ్కోలు పలుకుతూ భక్తులు నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కిడ్స్ లక్ష్మీ గణపతి మండలి నిర్వహకులు, భక్తులు పాల్గొని గణేశ్ నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
ALSO READ: SI Muthyam Rajender: కానిస్టేబుల్ నుంచి ఎస్సైగా.. రాయపర్తి ఎస్సై సక్సెస్ స్టోరీ