Minister Ponguleti: త్వరలో మరో 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు

Minister Ponguleti: రాష్ట్రంలోని పేదలు, రైతుల సంక్షేమాన్ని కేంద్రబిందువుగా చేసుకుని ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో శుక్రవారం నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, రైతులకు అన్ని విధాలుగా అండగా నిలవడం ప్రభుత్వ ప్రధాన బాధ్యతగా భావిస్తున్నామని చెప్పారు. రైతులకు అవసరమైన సాయం అందించడంతో పాటు వ్యవసాయాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం నిరంతరం...