Hindu Festival: తొలి ఏకాదశి విశిష్టత.. పూజా విధానం
Hindu Festival: తొలి ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో ఒకటిగా భావిస్తారు. ముఖ్యంగా ఆషాఢ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఈ ఏకాదశికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక విశిష్టత ఉందని పండితులు చెబుతారు. దీనిని శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. దక్షిణాయనం ప్రారంభమైన తర్వాత వచ్చే తొలి ఏకాదశి కావడంతో దీనికి "తొలి ఏకాదశి" అనే పేరు వచ్చింది. ఈ పర్వదినం నుంచే తెలుగు ప్రజలకు వరుసగా ముఖ్యమైన పండుగల కాలం ప్రారంభమవుతుందని శాస్త్రాలు పేర్కొంటాయి. ఈ ఏడాది తొలి ఏకాదశి...