Wedding Viral Video: ఫోటోలకు ఫోజులిస్తోన్న వధూవరులు.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన ఇద్దరు

Wedding Viral Video: భారతీయ వివాహ వేడుకలు అంటే సందడి, సంగీతం, నృత్యాలు, సరదా సంఘటనలకు వేదికగా నిలుస్తుంటాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పెళ్లి వేదికపై నూతన వధూవరులు కూర్చొని ఉండగానే ఇద్దరు యువకులు చేసిన ప్రమాదకర విన్యాసాలు ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చకు దారితీశాయి. వైరల్ అవుతున్న వీడియోలో కనిపించిన దృశ్యాల ప్రకారం.. వివాహ కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఇద్దరు యువకులు అకస్మాత్తుగా వేదికపైకి చేరుకున్నారు. మొదట సాధారణంగా ఏదైనా...