Traditional Recipe: బాలింతలు, రక్తం తక్కువ ఉన్నవాళ్లు తినాల్సిన నల్ల కూర
Traditional Recipe: ఆదివారం రోజు ప్రత్యేకంగా నాన్వెజ్ వంటకాలను ఆస్వాదించే వారిలో చాలామంది మేక నల్ల కూరను ఎంతో ఇష్టంగా తింటుంటారు. రుచితో పాటు పోషకాలు కూడా సమృద్ధిగా ఉండే ఈ వంటకం గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ సంప్రదాయ పద్ధతిలో తయారవుతోంది. ముఖ్యంగా రక్తహీనతతో బాధపడేవారు, ప్రసవం అనంతరం కోలుకుంటున్న బాలింతలు వంటి వారికి ఇది బలవర్ధక ఆహారంగా పెద్దలు సూచిస్తుంటారు. అయితే ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితి ఒకేలా ఉండదు కాబట్టి, ఇలాంటి ఆహారాన్ని తరచుగా తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం...