టీడీపీ కార్యకర్తల వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐపై చర్యలు తప్పవు: మంత్రి అనిత

పాయకరావుపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సాకేటి శంకర్ రావుపై వచ్చిన ఆరోపణలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయబోదని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ఆయనపై అందిన ఫిర్యాదులను పరిశీలించి అవసరమైతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు. ఈ అంశంపై సోమవారం అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల శంకర్ రావు నియామకంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. గతంలో ఆయన శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో సీఐగా పనిచేసిన సమయంలో టీడీపీ కార్యకర్తలను వేధించారనే ఆరోపణలు వెలుగులోకి...