Iran US conflict: మళ్లీ హర్మూజ్‌లో హై టెన్షన్
Iran US conflict: పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇటీవలే ఇరాన్, అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరి ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయనే భావన నెలకొన్న వేళ, తాజా పరిణామాలు మరోసారి యుద్ధ వాతావరణానికి దారితీస్తున్నాయి. రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్ దాడులకు పాల్పడిందనే ఆరోపణలు వెలువడుతున్నాయి. ఓమన్ తీరానికి సమీపంలో ప్రయాణిస్తున్న సింగపూర్‌కు చెందిన కార్గో నౌక ‘ఎవర్ లవ్లీ’పై ఇరాన్ డ్రోన్ దాడి జరిపినట్లు...