Indian Railways: దేశంలో తొలి హైడ్రోజన్ రైలు.. త్వరలోనే ప్రారంభం.. ఫీచర్లు చూస్తే..

Indian Railways: దేశంలో పర్యావరణ పరిరక్షణతో పాటు ఆధునిక రైల్వే సాంకేతికతకు మరింత ప్రాధాన్యం ఇస్తూ భారతీయ రైల్వే మరో చారిత్రాత్మక ఘట్టాన్ని నమోదు చేసింది. దేశంలోనే తొలి హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలును విజయవంతంగా పరీక్షించి స్వచ్ఛమైన రవాణా వ్యవస్థ దిశగా కీలక అడుగు వేసింది. హర్యానాలోని జింద్-సోనిపట్ రైల్వే మార్గంలో శుక్రవారం నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తికాగా, ఈ రైలును గంటకు 120 కిలోమీటర్ల వేగంతో పరీక్షించారు. మిగిలిన సాంకేతిక ప్రక్రియలు, భద్రతా ధ్రువీకరణలు పూర్తైన అనంతరం ప్రయాణికులకు అందుబాటులోకి...