Flight No Smoking Policy: స్మోకింగ్పై నిషేధం ఉన్నా.. విమానాల్లో ఈ యాష్ ట్రే ఎందుకు..?
Flight No Smoking Policy: నేటి విమాన ప్రయాణాల్లో ధూమపానం పూర్తిగా నిషేధించబడింది. విమానంలో సిగరెట్ తాగడం లేదా ధూమపానానికి సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించడం తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. అయినప్పటికీ ప్రపంచంలోని దాదాపు అన్ని వాణిజ్య విమానాల్లో టాయిలెట్ తలుపులపై చిన్న యాష్ ట్రే కనిపించడం చాలా మందిలో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పొగ తాగడం నిషేధించిన తర్వాత కూడా ఈ సదుపాయాన్ని ఎందుకు కొనసాగిస్తున్నారనే ప్రశ్నకు ఆసక్తికరమైన భద్రతా కారణం ఉంది. కొన్ని దశాబ్దాల క్రితం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేది. అప్పట్లో విమానాల్లో...