పెంపుడు కుక్కకు ఘన అంత్యక్రియలు.. ఈ కుటుంబం చేసిన పని అందరినీ కదిలించింది!
మనుషులు మాత్రమే కాదు, మూగజీవాలు కూడా కుటుంబంలో భాగమవుతాయని నిరూపించే ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. ఎన్నో సంవత్సరాలుగా కుటుంబంతో కలిసి జీవించిన పెంపుడు కుక్క మృతి చెందడంతో ఓ కుటుంబం కన్నీటి వీడ్కోలు పలికింది. చిట్యాల మండలం బొంగోని చెరువు గ్రామానికి చెందిన రైతు సామిడి మహేందర్ రెడ్డి పెంపుడు జంతువులను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. తన ఇంట్లో పెంచుకున్న కాలభైరవ అనే కుక్కను కూడా కుటుంబ సభ్యుడిలా భావించి పెంచుకున్నారు. కాలభైరవ కుటుంబ సభ్యుల వెంట ఎల్లప్పుడూ ఉండేది. ఇంటి పనుల...