Child Safety: సోషల్ మీడియాపై బ్యాన్..?
Child Safety: ఆన్‌లైన్ ప్రపంచంలో చిన్నారుల భద్రతను మరింత పటిష్టం చేయాలనే ఉద్దేశంతో యునైటెడ్ కింగ్‌డమ్ ప్రభుత్వం కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. 16 ఏళ్లలోపు పిల్లల సోషల్ మీడియా వినియోగంపై కఠిన ఆంక్షలు విధించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్, స్నాప్‌చాట్, రెడ్డిట్, థ్రెడ్స్, యూట్యూబ్, ట్విచ్, కిక్ వంటి ప్రముఖ సోషల్ మీడియా వేదికలను 16 ఏళ్లలోపు పిల్లలు ఉపయోగించకుండా పరిమితులు అమలు చేసే అవకాశం ఉంది. యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధానమంత్రి...