Babapur Village: ప్రైవేట్ బడులకు నో.. ప్రభుత్వ పాఠశాలలకే జై
Babapur Village: ప్రస్తుతం విద్యారంగంలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల హవా కొనసాగుతున్న వేళ తెలంగాణలోని ఓ గ్రామం తీసుకున్న నిర్ణయం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తమ పిల్లల భవిష్యత్తు కోసం వేలాది రూపాయలు ఖర్చు చేస్తూ ప్రైవేట్ పాఠశాలల వైపు పరుగులు తీస్తున్న ఈ రోజుల్లో, నిర్మల్ జిల్లాలోని ఒక గ్రామం మాత్రం ప్రభుత్వ పాఠశాలలకే పూర్తి మద్దతు ప్రకటించి ఆదర్శంగా నిలిచింది. ప్రైవేట్ పాఠశాలల్లో చదివితేనే మంచి విద్య లభిస్తుందనే భావనను పక్కనబెట్టి, ప్రభుత్వ బడుల్లో అందుతున్న సౌకర్యాలు, నాణ్యమైన బోధనపై విశ్వాసం...