Viral Video: ఒకటి, రెండు కాదు.. వాటర్ ట్యాంక్‌లో ఏకంగా 27 పాము పిల్లలు
Viral Video: ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంఘటన స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. సాధారణంగా ఇంటి నీటి ట్యాంకులను శుభ్రం చేసే సమయంలో బురద, నాచు లేదా చెత్త కనిపించడం సహజం. అయితే ఓ కుటుంబం తమ ఇంటి వాటర్ ట్యాంక్‌ను పరిశీలించగా లోపల కనిపించిన దృశ్యం వారిని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ట్యాంక్‌లో నీటితో పాటు డజన్ల కొద్దీ పాము పిల్లలు సంచరిస్తూ కనిపించడంతో కుటుంబ సభ్యులు భయంతో వణికిపోయారు. హరిద్వార్ జిల్లా పరిధిలోని సరాయ్ గ్రామంలో ఈ ఘటన...