Social Media: చాటింగ్ పేరుతో చీటింగ్.. వీడియో కాలింగ్‌తో లూటింగ్

Social Media: జమానా వేగంగా మారిపోతున్న కొద్దీ మనుషుల ఆలోచనా విధానం, ప్రవర్తనలో కూడా గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. తక్షణ ఆనందాల కోసం పరుగులు పెడుతూ, తియ్యటి మాటలకు సులభంగా ఆకర్షితులవుతూ, తెలియని మాయ వలల్లో చిక్కుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికల ద్వారా పరిచయాలు పెరిగి, అవే తర్వాత మోసాలకు దారి తీస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. మాటల మాధుర్యానికి మత్తెక్కి, అసలు వ్యక్తి ఎవరో కూడా తెలుసుకోకుండా నమ్మకం పెంచుకుని, చివరకు భారీగా డబ్బులు కోల్పోతున్న...