Weather Update: తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణ పరిస్థితులు..

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం భిన్నమైన వాతావరణ పరిస్థితులు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పగటి వేళల్లో ఎండలు తీవ్రంగా మండిపోతుండగా, సాయంత్రం సమయాల్లో ఒక్కసారిగా వర్షాలు కురవడం విశేషంగా మారింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలు బయటకు రావడానికే వెనుకంజ వేస్తున్నారు. ఇదే సమయంలో వాతావరణ శాఖ నుంచి వచ్చిన తాజా సమాచారం ప్రకారం, ఎండల తీవ్రత తగ్గకపోయినా, రానున్న రోజుల్లో వర్షాలు కూడా కురిసే...