Telangana: టీజీఎస్‌ఆర్టీసీ కార్మికుల సమ్మెపై రేవంత్ స్పందన

Telangana: టీజీఎస్‌ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్రిక్తతల మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకంగా స్పందించారు. ఆర్టీసీ సమస్యలపై రాష్ట్ర మంత్రివర్గంలో ప్రత్యేకంగా చర్చించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులు ఆవేశపూరిత నిర్ణయాలకు లోనవ్వకూడదని విజ్ఞప్తి చేస్తూ, ప్రాణాలు తీసుకోవడం ద్వారా ఎలాంటి సమస్యలు పరిష్కారం కావని స్పష్టం చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో ఉందని, ఉప ముఖ్యమంత్రి భట్టి ఆధ్వర్యంలో ఏప్రిల్ 24న కార్మిక సంఘాలతో కీలక సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కార్మికుల డిమాండ్లను సానుకూలంగా పరిశీలిస్తామని హామీ...