Rohit Sharma: హిట్‌మ్యాన్ గాయంపై తాజా అప్‌డేట్

Rohit Sharma: ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుస ఓటములతో ఇబ్బందులు పడుతున్న ముంబై ఇండియన్స్ అభిమానులకు కాస్త ఊరటనిచ్చే వార్త బయటకు వచ్చింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన కీలక మ్యాచ్‌లో గాయపడ్డ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ పరిస్థితిపై వచ్చిన తాజా సమాచారం జట్టుకు పెద్ద రిలీఫ్ ఇచ్చింది. మ్యాచ్ సమయంలో అతను నొప్పితో ఇబ్బంది పడుతూ మైదానం వీడటంతో, ఈ సీజన్ మొత్తానికి దూరమవుతాడేమో అన్న ఆందోళన అభిమానుల్లో నెలకొంది. అయితే వైద్య పరీక్షల అనంతరం కండరాల్లో ఎలాంటి చీలిక లేదని...