RBI Rules: ఒకేసారి 2, 3 పర్సనల్ లోన్స్ తీసుకోవచ్చా..?
RBI Rules: ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో అవసరం వచ్చినప్పుడు చాలా మంది ముందుగా ఆశ్రయించేది రుణాలనే. వ్యక్తిగత అవసరాలు, వైద్య అత్యవసరాలు, ఇల్లు, కారు కొనుగోలు వంటి సందర్భాల్లో పర్సనల్ లోన్లు కీలకంగా మారాయి. అయితే ఇప్పటికే ఒక పర్సనల్ లోన్ కొనసాగుతుండగా మరో రుణం తీసుకోవచ్చా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఒకేసారి ఎన్ని రుణాలు తీసుకోవాలనే అంశంపై కఠిన పరిమితులు లేవు. అంటే చట్టపరంగా ఒకేసారి 2 లేదా...