IPL 2026: వైభవ్ సూర్యవంశీ రిమోట్ కారు ఆటలు.. లైసెన్స్ లేదు జాగ్రత్త అంటూ ఆటపట్టించిన సిబ్బంది (VIDEO)

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ మైదానంలో ఫోర్లు, సిక్సర్ల సందడి మాత్రమే కాకుండా ఆటగాళ్ల మధ్య జరిగే సరదా క్షణాలతో కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ జట్టులో చోటుచేసుకుంటున్న వినోదాత్మక సంఘటనలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ ఈసారి తన బ్యాటింగ్ కంటే భిన్నంగా ఒక రిమోట్ కారుతో వార్తల్లో నిలిచాడు. ప్రాక్టీస్ సమయంలో మైదానంలో రిమోట్ కారును నడుపుతూ సరదాగా గడిపిన అతని వీడియోను జట్టు సిబ్బంది రికార్డ్ చేయగా,...