China Rocket: కుప్పకూలిన చైనా రాకెట్ (VIDEO)

China Rocket: అంతరిక్ష రంగంలో అగ్రదేశాల మధ్య పోటీ రోజురోజుకీ తీవ్రమవుతున్న తరుణంలో, అమెరికాకు సవాల్ విసురుతూ వేగంగా ముందుకు సాగుతున్న చైనాకు అనూహ్యమైన ఎదురుదెబ్బ తగిలింది. ప్రైవేట్ అంతరిక్ష ప్రయోగాల్లో కీలక పాత్ర పోషిస్తున్న స్పేస్ పయనీర్ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేసిన తియాన్‌లాంగ్-3 రాకెట్ పరీక్ష ఘోరంగా విఫలమైంది. హెనాన్ ప్రాంతంలోని గాంగ్‌యీ నగర సమీపంలో ఉన్న డాంగ్‌ఫెంగ్ కమర్షియల్ ఏరోస్పేస్ ఇన్నోవేషన్ కేంద్రం నుంచి ఈ పరీక్ష నిర్వహించగా, భూమిపై ఇంజిన్ పరీక్షలు చేస్తుండగానే సాంకేతిక లోపం తలెత్తి రాకెట్...