STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 13 April 2026, 10:06 pm Posted by : Star Trinethram

నూనె కుమార్ యాదవ్‌కు బి.పి.మండల్ అవార్డు ప్రదానం

స్టార్ త్రినేత్రం, సిద్ధిపేట: బీసీల హక్కుల సాధనలో కృషి చేస్తున్న బీఆర్‌ఎస్ కొండపాక మండల అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్‌కు ప్రతిష్టాత్మక బి.పి. మండల్ అవార్డు ప్రదానం చేశారు. బీసీల పితామహుడు, మాజీ బీసీ కమిషన్ చైర్మన్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి బిందేశ్వరి ప్రసాద్ మండల్ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. బహుజనుల రాజ్యాధికార సాధన సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నూనె కుమార్ యాదవ్‌కు అవార్డును అందజేశారు. బీసీలు మరియు వెనుకబడిన తరగతుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నందుకు గాను ఈ అవార్డు ప్రదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అవార్డు స్వీకరించిన అనంతరం నూనె కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. బి.పి.మండల్ వర్ధంతి సందర్భంగా ఈ గౌరవం దక్కడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ అవార్డు తనపై మరింత బాధ్యతను పెంచిందని, ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. అదేవిధంగా బీసీల అభివృద్ధి, అభ్యున్నతి, రిజర్వేషన్ల సాధన కోసం మరింత తీవ్రంగా పోరాటం కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ALSO READ: Politics: నాడు తిట్టి.. నేడు జంపింగ్!