Viral News: వధువు వింత కండిషన్.. అతిగా నగలు వేసుకుంటే పెళ్లిలోకి నో ఎంట్రీ!
Viral News: పెళ్లి వేడుక అంటే సాధారణంగా వధూవరుల కంటే అతిథుల హడావుడే ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలు పోటీపడి మరీ ఖరీదైన పట్టుచీరలు, భారీ బంగారు ఆభరణాలు ధరించి వస్తుంటారు. కానీ ఒక వధువు మాత్రం తన పెళ్లి రోజున తానే ప్రధాన ఆకర్షణగా ఉండాలని భావించి అతిథుల అలంకరణపై ప్రత్యేక ఆంక్షలు విధించింది. ఈ ఆసక్తికర సంఘటన చైనాలో చోటుచేసుకుంది. సాధారణంగా పెళ్లి ఆహ్వాన పత్రంలో వేడుక సమయం, వేదిక వివరాలు మాత్రమే ఉంటాయి. అయితే ఈ వధువు పంపిన ఆహ్వానంలో...