Vaibhav Suryavanshi: భారత జట్టులోకి ‘వండర్ కిడ్’ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్..!

Vaibhav Suryavanshi: భారత క్రికెట్ చరిత్రలో అరుదైన ఘట్టానికి నాంది పలికే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కేవలం 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టేందుకు బీహార్‌కు చెందిన యువ ప్రతిభ వైభవ్ సూర్యవంశీ అర్హత సాధించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చిన్న వయసులోనే తన అసాధారణ ప్రతిభతో గుర్తింపు తెచ్చుకున్న ఈ యువ బ్యాటర్, ఇప్పుడు సీనియర్ జట్టులో స్థానం కోసం గట్టిగా పోటీ పడుతున్నాడు. ఐపీఎల్, అండర్ 19 ప్రపంచకప్ వంటి వేదికలపై పరుగుల వరద పారించిన అతని ప్రదర్శన సెలెక్టర్ల దృష్టిని...