Trump: ఇరాన్‌తో యుద్ధానికి అసలు కారకుడు అతడే

Trump: ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం నాలుగో వారంలోకి ప్రవేశించిన నేపథ్యంలో ఈ యుద్ధం ప్రారంభంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు దారితీశాయి. యుద్ధం ఎలా ప్రారంభమైందన్న అంశంపై ఇప్పటికే అనేక సందేహాలు నెలకొన్న తరుణంలో, ట్రంప్ చేసిన తాజా ప్రకటనలు పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చాయి. టెన్నెస్సీలో జరిగిన ఒక మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సైనిక చర్యకు మద్దతుగా ముందుగా మాట్లాడింది తన రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ అని వెల్లడించారు. ఇరాన్ అణ్వాయుధాల...