Telangana Politics: గులాబీ పార్టీకి కవిత సవాల్?

Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మలుపులు తిరుగుతున్న తరుణంలో కల్వకుంట్ల కవిత తీసుకున్న తాజా నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ జాగృతి సంస్థను పూర్తిస్థాయి రాజకీయ పార్టీ (తెలంగాణ ప్రజా జాగృతి)గా మారుస్తున్నట్లు ప్రకటించడం ద్వారా ఆమె రాజకీయంగా కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్టైంది. ఏప్రిల్ 25న పార్టీ జెండా, ఎజెండాను అధికారికంగా ప్రకటించనున్నట్లు వెల్లడించడంతో, ఇప్పటికే ఉన్న రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా కుదేలవుతున్నాయి. తెలంగాణలో తమదొక్కటే నిజమైన ప్రాంతీయ పార్టీ అవుతామని కవిత ప్రకటించడం, రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు...