Telangana Congress: జగ్గారెడ్డికి పీసీసీ పగ్గాలా?

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ పాత చర్చలు కొత్త ఊపుతో ముందుకు వస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పడి వ్యవహారాలు సవ్యంగా నడుస్తున్నాయనే భావన నెలకొన్న సమయంలోనే, పీసీసీ అధ్యక్ష పదవిపై వచ్చిన తాజా వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే పీసీసీ బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్ కొనసాగుతున్న నేపథ్యంలో, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిను పీసీసీ చీఫ్‌గా చేస్తే కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తుందన్న వ్యాఖ్యలు రాజకీయంగా...