Raghuram Rajan: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారీ ముప్పు!
Raghuram Rajan: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలకు దారితీస్తున్న అమెరికా- ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలు గ్లోబల్ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందనే అంశమే ప్రపంచ ఆర్థిక గమనాన్ని నిర్ణయించే కీలక అంశమని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ ఘర్షణ ప్రభావం ప్రపంచ ఇంధన సరఫరాపై స్పష్టంగా కనిపిస్తున్నదని, దాదాపు 15 నుంచి 20 శాతం వరకు సరఫరా అంతరాయం ఏర్పడే...