Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఉగాది సందర్భంగా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజు నుంచే మిశ్రమ స్పందన లభిస్తున్నప్పటికీ, అభిమానుల నుంచి మాత్రం మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా పవన్ కల్యాణ్ మేనరిజమ్స్, డ్యాన్సులు, యాక్షన్ సన్నివేశాలకు థియేటర్లలో విజిల్స్, హర్షధ్వానాలు వినిపిస్తున్నాయి. గతంలో గబ్బర్ సింగ్ సినిమాతో భారీ విజయాన్ని అందించిన హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని...