Mumaith Khan: ఆ స్టార్ హీరో హగ్ చేసుకోగానే సిగ్గు పడ్డాడు
Mumaith Khan: ఒకప్పుడు ఐటమ్ సాంగ్స్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ముమైత్ ఖాన్ పేరు వినగానే ప్రేక్షకులకు గుర్తుకొచ్చేది ఆమె అందం, డ్యాన్స్ స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్. కుర్రాళ్ల కలల రాకుమారిగా నిలిచిన ఈ భామ, ఒకప్పుడు సినిమాలో ఐటమ్ సాంగ్ అంటే తప్పనిసరిగా ఉండాల్సిన పేరుగా మారింది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ చిత్రాల్లోనూ తన ప్రత్యేకతను చూపిస్తూ వరుస అవకాశాలను అందుకుంది. కేవలం ఐటమ్ సాంగ్స్ మాత్రమే కాకుండా, హీరోయిన్గా కూడా కొన్ని సినిమాల్లో నటించి తన ప్రతిభను...