LPG Supply: ఇక సిలిండర్లపై టెన్షనొద్దు.. గ్యాస్ సరఫరాపై కేంద్రం గుడ్‌న్యూస్

LPG Supply: పశ్చిమాసియా ప్రాంతంలో రోజురోజుకు ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలపై అనేక దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలు చమురు సరఫరాలపై ప్రభావం చూపవచ్చనే భయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో దేశంలో వంట గ్యాస్ కొరత ఏర్పడుతుందనే వార్తలు ప్రజల్లో కొంత ఆందోళన కలిగించాయి. అయితే ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. దేశంలో గ్యాస్ కొరతకు ఎలాంటి అవకాశం లేదని, వినియోగదారులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కేంద్రం వెల్లడించింది....