Iran Missile Power: అమెరికా, ఇజ్రాయెల్‌కు కోలుకోలేని దెబ్బ
Iran Missile Power: అమెరికా, ఇజ్రాయెల్ పలు మార్గాల్లో దాడులు కొనసాగిస్తున్నప్పటికీ ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గకుండా తన సైనిక సామర్థ్యాన్ని నిరంతరం ప్రదర్శిస్తోంది. మధ్యప్రాచ్యంలో అత్యధిక స్థాయిలో క్షిపణి నిల్వలు కలిగిన దేశంగా ఇరాన్ నిలుస్తోందనే అభిప్రాయం ప్రపంచ దేశాల్లో బలపడుతోంది. ఇప్పటివరకు వచ్చిన అంచనాల ప్రకారం ఇరాన్ వద్ద వేల సంఖ్యలో బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులు ఉన్నాయి. వీటిలో కొన్ని అత్యంత వేగవంతంగా, కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం కలిగినవిగా గుర్తింపు పొందాయి. ఈ క్షిపణులను ప్రయోగించిన తర్వాత అవి లక్ష్యాన్ని...