IPL: కాయ్ రాజా కాయ్!.. కోటిశ్వరులను సైతం రోడ్డున పడేసే బెట్టింగ్ భూతం యాప్స్!
IPL: క్రికెట్ అభిమానులను 60 రోజులపాటు ఉర్రూతలూగించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైన వెంటనే బెట్టింగ్ దందా కూడా ఉధృతమైంది. డిజిటల్ ఇండియా ఫౌండేషన్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఈసారి ఐపీఎల్ సీజన్ ముగిసే సరికి దేశవ్యాప్తంగా బెట్టింగ్ వ్యాపారంలో రూ.10000 కోట్లకు పైగా డబ్బు చేతులు మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఒక్క రాష్ట్రంలోనే ఈ మొత్తం రూ.1000 కోట్లకు మించి ఉండొచ్చని అంచనా. ఈ నేపథ్యంలో బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకుని అప్పులపాలై చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడం, వందలాది...