Hanuman Jayanti 2026: ఈ సంవత్సరం హనుమాన్ జయంతి ఎప్పుడో తెలుసా?

Hanuman Jayanti 2026: భారతీయులు మాత్రమే కాక, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది హిందూ భక్తులు హనుమాన్ జయంతి పండుగను ఉత్సాహంతో జరుపుకుంటారు. ఈ పవిత్ర దినం శ్రీ హనుమంతుడి జన్మదినాన్ని గుర్తుచేసుకోవడమే కాక, ఆయన ఆధ్యాత్మిక శక్తులు, ధైర్యం, బలం, రక్షణను పొందే ప్రత్యేక అవకాశంగా భావించబడుతుంది. హనుమంతుడు శ్రీరాముని అత్యంత భక్తిగా, కష్టాలను తొలగించే శక్తివంతమైన దేవుడిగా ప్రసిద్ధి చెందాడు. పురాణాల ప్రకారం.. జీవితంలో ఎదురయ్యే విఘ్నాలు, సమస్యలు తొలగించాలంటే హనుమంతుడిని ఆరాధించడం అత్యంత శుభప్రదం. అందువల్ల ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి...