Gender-affirming surgeries: ట్రాన్స్జెండర్ల సర్జరీల వెనుక నమ్మలేని నిజాలు!
Gender-affirming surgeries: సమాజంలో కొన్ని వర్గాలపై జోకులు చేయడం, వారిని అవమానించడం ఒక వినోదంగా మారిపోయిన దురదృష్టకర పరిస్థితి ఇప్పటికీ కనిపిస్తూనే ఉంది. ముఖ్యంగా ట్రాన్స్జెండర్ల విషయంలో ఇది మరింత తీవ్రంగా ఉంటుంది. సినిమాల్లోనైనా, వినోద కార్యక్రమాల్లోనైనా వారిని కించపరిచే విధంగా చూపించడం చాలామందికి నవ్వుల పండుగగా మారింది. ఎవరినైనా తక్కువ చేసి చూపాలంటే ట్రాన్స్జెండర్లను ఉదాహరణగా చూపించే సంస్కృతి మన సమాజంలో కొత్తది కాదు. ఈ ప్రపంచంలో కేవలం రెండు లింగాలే ఉన్నాయనే అజ్ఞానం ఇంకా చాలా మందిలో ఉంది. అదే సత్యమని...